Maha kumbha Mela 2025: మహా కుంభమేళాలో పుష్పరాజ్ గెటప్‌లో సందడి చేసిన అభిమాని.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ని దించేశాడు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం, వీడియో ఇదిగో గెటప్‌తో కూడా 'తగ్గేదేలే'..!

మహా కుంభమేళాలో అల్లు అర్జున్ పుష్ప 2 గెటప్‌తో సందడి చేశాడు ఓ అభిమాని. తగ్గేదేలే అంటూ అచ్చు గుద్దినట్టు పుష్పరాజ్‌ను దించేశాడు.

Maha kumbha Mela 2025: మహా కుంభమేళాలో పుష్పరాజ్ గెటప్‌లో సందడి చేసిన అభిమాని.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ని దించేశాడు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం, వీడియో ఇదిగో గెటప్‌తో కూడా 'తగ్గేదేలే'..!
Pushpa 2 Allu Arjun fan buzz in Prayagraj Maha Kumbh Mela!(X)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో 25వ రోజుకు చేరింది. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర పుణ్యస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మహా కుంభమేళాలో అల్లు అర్జున్ పుష్ప 2 గెటప్‌తో సందడి చేశాడు ఓ అభిమాని. తగ్గేదేలే అంటూ అచ్చు గుద్దినట్టు పుష్పరాజ్‌ను దించేశాడు. ఇక ఆ వ్యక్తితో సెల్ఫీలు దిగేందుకు అంతా పోటీ పడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహా కుంభమేళాలో 39 కోట్ల మంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా

జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా ఇప్పటివరకు 40 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26 శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.

Pushpa 2  Allu Arjun fan buzz in Prayagraj Maha Kumbh Mela!

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 06, 2025 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).