Viral Video: కాలువ లో కొట్టుకుపోతున్న యువతిని కాపాడిన వీర సైనికుడు.. పంజాబ్ పాటియాలాలో ఘటన.. వీడియో ఇదిగో!
ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోతున్న ఓ యువతిని ఆర్మీ జవాను ప్రాణాలకు తెగించి కాపాడారు. కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా అందులోకి దూకి అమ్మాయిని రక్షించారు. పంజాబ్ లోని పాటియాలాలో ఆదివారం జరిగిందీ ఘటన.
Newdelhi, June 19: ప్రమాదవశాత్తు కాలువలో (Canal) పడి కొట్టుకుపోతున్న ఓ యువతిని (Girl) ఆర్మీ జవాను (Soldier) ప్రాణాలకు తెగించి కాపాడారు. కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా అందులోకి దూకి అమ్మాయిని రక్షించారు. పంజాబ్ లోని పాటియాలాలో ఆదివారం జరిగిందీ ఘటన. పాటియాలాలోని భాక్రా కెనాల్ ఎప్పుడూ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. అయితే ఓ యువతి ప్రమాదవశాత్తు ఆ కాలువలో పడి కొట్టుకుపోసాగింది. ఆమెను గమనించిన జవాన్ డీఎన్ క్రిష్ణన్.. వెంటనే నీటిలోకి దూకేశారు. యువతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సాధ్యపడలేదు. స్థానికులు గమనించి బయటి నుంచి జవానుకు తాళ్లు అందించారు. వాటి సాయంతో యువతిని జవాను ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#IndianArmy soldier, Sepoy DN Krishnan jumped in ferocious #BhakraCanal near #Patiala & rescued a drowning teenage girl who had fallen in the canal. Kudos to the indomitable spirit & courage of the soldier!#IndianArmy - Always in the service of nation! #AirwatDivision@adgpi pic.twitter.com/CLQLGQaXKE
— prodefencechandigarh (@prodefencechan1) June 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 19, 2023 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

