UP Road Accident: యూపీలో ఘోరం.. టైరు పేలడంతో ట్రక్కును ఢీకొట్టిన కారు.. చిన్నారి సహా 8 మంది సజీవ దహనం (వీడియోతో)
ఉత్తరప్రదేశ్ లోని భోజిపురాలో ఘోరం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా 8మంది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా శనివారం రాత్రి బరేలీ జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన.
Newdelhi, Dec 10: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని భోజిపురాలో ఘోరం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా 8మంది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా శనివారం రాత్రి బరేలీ జాతీయ రహదారిపై (National Highway) జరిగిందీ ఘటన. ప్రమాదం తర్వాత కారు సెంట్రల్ లాక్ (Central Lock) పడిపోవడంతో లోపలున్న వారు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతిలి రోడ్డులో ఉత్తరాఖండ్ నుంచి ఇసుకతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. కారును ట్రక్కు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. కారు డోర్లు లాక్ కావడంతో లోపల ఉన్నవారు తప్పించుకోలేకపోయారు. కారు నుంచి చిన్నారి సహా ఏడుగురి కాలిన మృతదేహాలను బయటకు తీశారు.
Uttar Pradesh Road #Accident: Eight Killed As Car Collides With Truck and Catches Fire After Being Dragged On Highway Near Bhojipura... #CarAccident #RoadAccident #Bhojipura #Bareilly #UttarPradesh pic.twitter.com/gqQxbcP94L
— Devesh (@Devesh81403955) December 10, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 10, 2023 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

