UP Horror: వ్యక్తి వెనుక పటాకులు కాల్చిన వైనం.. కుప్పకూలి మృతి.. ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ లో ఘటన (వీడియోతో)

వ్యక్తి వెనుక పటాకులు కాల్చడంతో అతడు కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

UP Horror: వ్యక్తి వెనుక పటాకులు కాల్చిన వైనం.. కుప్పకూలి మృతి..  ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ లో ఘటన  (వీడియోతో)
Fire Crackers (Credits: X)

Newdelhi, Nov 14: వ్యక్తి వెనుక పటాకులు (Crackers) కాల్చడంతో అతడు కుప్పకూలి మరణించాడు. (man dies after firecrackers thrown at him) ఈ సంఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో (Video) క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం లింక్‌ రోడ్‌ ప్రాంతంలో దీపావళి సందర్భంగా ఒక వీధిలో కొందరు వ్యక్తులు ఉన్నారు. 40 ఏళ్ల వ్యక్తి, మరొకరు వారి వద్దకు వెళ్లారు. మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగారు. ఇంతలో ఆ గుంపులోని ఒకరు 40 ఏళ్ల వ్యక్తి వెనుక పటాకులు కాల్చాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. మృతుడ్ని 40 ఏళ్ల నాటు అలియాస్ అఫ్జల్‌ గా పోలీసులు గుర్తించారు.

Harish Rao About CM Post: కేటీఆర్‌ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 14, 2023 10:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).