గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి కారుపై కూర్చుని మందు తాగుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు పైన కూర్చుని ప్రశాంతంగా మద్యం సేవిస్తూ ఉంటాడు. కారులో ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తికి సైతం పైన్నుంచి మందు సప్లై చేస్తుంటాడు. రద్దీ ప్రదేశంలోని ట్రాఫిక్‌ జామ్‌లో కనిపించి ఈ దృశ్యాలను అక్కడే ఉన్న జనం వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను రవి హందా అనే నెటిజన్‌ జనవరి 7వ తేదీన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘గురుగ్రామ్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 30వేల మందికిపైగా వీక్షించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)