Viral Video: వైరల్ వీడియో, మందును దొంగతనం చేసేందుకు షాపుకు కన్నం, అయితే మనసు మారి అక్కడే తాగడం మొదలు పెట్టడంతో పోలీసులకు చిక్కిన దొంగలు
తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలోవైరల్ ఘటన చోటు చేసుకుంది.స్థానికంగా నివశించే ఇద్దరు మందు బాబులు.. మద్యం కోసం ఒక లిక్కర్ షాపుకు కన్నం వేశారు.గోడకు కన్నం పెట్టి లోపలకు వెళ్లిన వారు కొంత మద్యం ఎత్తుకెళ్లి బయట అమ్ముకుందామని ముందుగా అనుకున్నారు.
తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలోవైరల్ ఘటన చోటు చేసుకుంది.స్థానికంగా నివశించే ఇద్దరు మందు బాబులు.. మద్యం కోసం ఒక లిక్కర్ షాపుకు కన్నం వేశారు.గోడకు కన్నం పెట్టి లోపలకు వెళ్లిన వారు కొంత మద్యం ఎత్తుకెళ్లి బయట అమ్ముకుందామని ముందుగా అనుకున్నారు. అయితే లోపలకు వెళ్లాక వాళ్ల మనసులు మారిపోయాయి. దాంతో అక్కడే కూర్చొని తాగడం మొదలుపెట్టారు.
అదే సమయంలో రాత్రి పూట గస్తీ తిరుగుతున్న పోలీసులు దీన్ని గమనించారు. లిక్కర్ షాపు దగ్గరకు వెళ్లి టార్చ్ లైట్లతో లోపల జరుగుతున్న తంతును చూశారు. ఓనర్‌కు ఫోన్ చెయ్యడానికి ముందు.. గోడకు చేసిన కన్నం నుంచే వాళ్లిద్దరినీ బయటకు లాగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX
— Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 05, 2022 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

