Man Drags Cop On Car: నవీ ముంబైలో దారుణం.. ట్రాఫిక్ పోలీసును కారు బానెట్‌పై 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్

తనను ఆపేందుకు ప్రయత్నించిన ఓ ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టిన కారు డ్రైవర్ అతడిని ఏకంగా 10 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగిందీ ఘటన.

Man Drags Cop On Car: నవీ ముంబైలో దారుణం.. ట్రాఫిక్ పోలీసును కారు బానెట్‌పై 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్
Credits: Twitter

Mumbai, April 17: తనను ఆపేందుకు ప్రయత్నించిన ఓ ట్రాఫిక్ పోలీసు (Traffic Police)ను ఢీకొట్టిన కారు డ్రైవర్ (Car Driver)  అతడిని ఏకంగా 10 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో (Navi Mumbai) జరిగిందీ ఘటన. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కోపర్‌ఖెరాణె-వాశీ మార్గంలో శనివారం ఈ ఘటన జరిగింది. అప్పటికే కారును వెంబడించిన పోలీసులు కిందపడిన ట్రాఫిక్ పోలీసు సిద్ధేశ్వర్‌ను రక్షించారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. ఆ తర్వాత అతడికి జరిపిన వైద్య పరీక్షల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు తేలింది. హత్యాయత్నం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్, మాదక ద్రవ్యాల చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Jagadish Shettar joins Congress: ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్, కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 17, 2023 10:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).