Goods Train Seized: మూడు ఏనుగుల్ని చంపిందని గూడ్స్‌ రైలు సీజ్‌.. పశ్చిమ బెంగాల్‌లో అటవీ శాఖ అధికారులు వెల్లడి

మూడు ఏనుగులు చనిపోవడానికి కారణమైందని పశ్చిమ బెంగాల్‌ అలీపూర్‌ దార్‌ జిల్లా అటవీ శాఖ అధికారులు సోమవారం ఓ గూడ్స్‌ రైలును సీజ్‌ చేశారు.

Goods Train Seized: మూడు ఏనుగుల్ని చంపిందని గూడ్స్‌ రైలు సీజ్‌.. పశ్చిమ బెంగాల్‌లో అటవీ శాఖ అధికారులు వెల్లడి
Jharkhand Elephant Kills (PIC @ Wikimedia commons)

Newdelhi, Nov 28: మూడు ఏనుగులు (Elephants) చనిపోవడానికి కారణమైందని పశ్చిమ బెంగాల్‌ (West Bengal) అలీపూర్‌ దార్‌ జిల్లా అటవీ శాఖ అధికారులు సోమవారం ఓ గూడ్స్‌ రైలును (Goods Train) సీజ్‌ చేశారు. రాజభట్‌ ఖావా అటవీ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్‌ వద్ద ఏనుగులు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టినట్టు అలీపూర్‌దార్‌ జిల్లా అధికారులు తెలిపారు. ‘గూడ్స్‌ రైల్‌ను అటవీ శాఖ భౌతికంగా స్వాధీనం చేసుకోలేదు. సాంకేతికంగా రైలును సీజ్‌ చేశాం. దీనికి సంబంధించి పత్రాల్ని సిద్ధం చేశాం. ప్రస్తుతం రైలు ప్రమాద ఘటన వద్దే ఆగిపోయింది’ అని చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ దేబల్‌ రాయ్‌ చెప్పారు.

White Water From Hand Pump: బోరింగు నుంచి నీళ్లకు బదులు తెల్లటి ద్రవం.. క్యాన్లు, బిందలతో ఎగబడిన జనం.. పాలు కాదంటున్న అధికారులు (వీడియోతో)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 28, 2023 09:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).