Newdelhi, Nov 28: ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ లో (Moradabad) విచిత్రం చోటుచేసుకున్నది. మొరాదాబాద్‌లోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ బోరింగు (Hand pump) నుంచి తెలుపు రంగులో (White water) ఉన్న నీళ్లు వస్తున్నాయి. దీంతో వాటిని పాలుగా (Milk) భావించిన ప్రజలు.. చేతి పంపులో నుంచి నీళ్లకు బదులు పాలు వస్తున్నాయంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇంకేముంది క్షణాల్లో పట్టణమంతా ఆ వార్త వ్యాపించింది. దీంతో జనాలు ఆ బోరింగ్‌ వద్దకు క్యూకట్టారు. బాటిళ్లు, బకెట్లు, క్యాన్లు, బిందలు, ప్లాస్టిక్‌ కవర్లలో ఆ తెల్లటి ద్రవాన్ని పట్టుకుని వెళ్లారు. సమాచారం అందుకున్న మున్సిపల్‌ అధికారులు ఆ బోరింగ్‌ ను పరిశీలించారు. అవి పాలు కాదని, కలుషిత నీళ్లని (Contamination) తెలిపారు. చేతిపంపు అడుగు భాగంలో చెడిపోయిందని, దీంతో అది ఒకట్టినప్పుడు తెలుపు రంగులో ఉన్న కలుషితమైన నీరు బయటకు వస్తున్నదని చెప్పారు.

Telangana Assembly Election: నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం.. సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు.. ప్రచారం ముగిసిన వెంటనే అమల్లోకి 144 సెక్షన్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)