Jayaprada: చేసిన పాపాలకు ఆజంఖాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. జయప్రద సంచలన వ్యాఖ్యలు .. వీడియోతో
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలపై జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి మహిళలను గౌరవించడం తెలియదని, ఇక ఆజంఖాన్ పని అయిపోయినట్టేనని, చేసిన పాపాలకు ఆజంఖాన్, ఆయన కుమారుడు మూల్యం చెల్లించుకోక తప్పదని జయప్రద అన్నారు.
Newdelhi, Feb 21: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ (Azam Khan), ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం (Abdulla Azam)లపై మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రద (Jayaprada) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి మహిళలను గౌరవించడం తెలియదని, ఇక ఆజంఖాన్ పని అయిపోయినట్టేనని, చేసిన పాపాలకు ఆజంఖాన్, ఆయన కుమారుడు మూల్యం చెల్లించుకోక తప్పదని జయప్రద అన్నారు. అధికార గర్వం ఉండకూడదని పేర్కొన్న ఆమె మహిళలను గౌరవించాలని, పేదలు, అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయాలని అన్నారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆజంఖాన్‌పై అప్పట్లో కేసు నమోదైంది.
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 21, 2023 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

