Dadasaheb Phalke International Film Festival Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్, ఉత్తమ నటి అలియా.. మన ఆర్ఆర్ఆర్ కూ అవార్డు.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితా ఏమిటంటే??

దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల పురస్కార వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో పలువురు స్టార్స్ అలియా భట్, వరుణ్ ధావన్, అనుపమ్ ఖేర్, రేఖ, దుల్కర్ సల్మాన్ తో పాటు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి తదితరులు హాజరయ్యి సందడి చేశారు.

Dadasaheb Phalke International Film Festival Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్, ఉత్తమ నటి అలియా.. మన ఆర్ఆర్ఆర్ కూ అవార్డు.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితా ఏమిటంటే??
Dadasaheb Phalke International Film Festival Awards 2023 Winners (Photo Credits: Twitter)

Mumbai, Feb 21: దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల పురస్కార వేడుకలు (Dadasaheb Phalke International Film Festival Awards 2023) ముంబైలో (Mumbai) ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో పలువురు స్టార్స్ అలియా భట్ (Alia Bhatt), వరుణ్ ధావన్ (Varun Dhawan), అనుపమ్ ఖేర్, రేఖ, దుల్కర్ సల్మాన్ తో పాటు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి తదితరులు హాజరయ్యి సందడి చేశారు.

స్టార్ సింగర్ సోనూ నిగమ్ పై దాడి.. ఆసుపత్రికి తరలింపు.. వీడియో

పురస్కారాల్లో భాగంగా బ్రహ్మాస్త్ర సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా రణ్‌బీర్  అవార్డుని అందుకున్నాడు. ప్రస్తుతం తను యానిమల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో అవార్డ్ అందుకోడానికి రాలేకపోయాడు. దీంతో ఈ అవార్డుని అతని భార్య అలియా భట్ అందుకుంది. అలాగే ‘గంగూబాయి కతియావాడి’ మూవీకు గాను అలియా ఉత్తమ్ నటిగా అవార్డుని కైవసం చేసుకుంది. పెళ్లి అయిన తరువాత ఇద్దరికీ ఇలా ఒకే స్టేజి పై, అది ప్రతిష్టాత్మకమైన అవార్డ్ వరించడంతో అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఉత్తమ చిత్రంగా కశ్మీర్ ఫైల్స్, ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా ఆర్ఆర్ఆర్ కు  అవార్డులు  దక్కాయి.

30 శాతం ఉద్యోగులను సాగనంపిన బెంగళూరు స్టార్టప్ మైగేట్

అలాగే హీరో వరుణ్ ధావన్.. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా అవార్డుని అందుకున్నాడు. గత ఏడాది చివరిలో విడుదలైన ‘భేడియా’ సినిమాకి వరుణ్ ధావన్ అవార్డ్ అందుకున్నాడు. ఇక అనుపమ్ ఖేర్ కి – మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డ్, సాచిత్ తాండిన్ కి – బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డ్, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు రిషబ్ శెట్టిని వరించింది.

(The above story first appeared on LatestLY on Feb 21, 2023 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).