Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు, 71 మెడల్స్‌తో పాత రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ల బృందం
ఆసియా క్రీడల్లో(Asian Games) భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హాంగ్జూలో జరుగుతున్న గేమ్స్‌లో ఇప్పటి వరకు ఇండియా 71 పతకాలను కైవసం చేసుకున్నది. దీంతో ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో ఇండియాకు అత్యధిక సంఖ్యలో పతకాలు రావడం ఇదే మొదటిసారి.
ఆసియా క్రీడల్లో(Asian Games) భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హాంగ్జూలో జరుగుతున్న గేమ్స్‌లో ఇప్పటి వరకు ఇండియా 71 పతకాలను కైవసం చేసుకున్నది. దీంతో ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో ఇండియాకు అత్యధిక సంఖ్యలో పతకాలు రావడం ఇదే మొదటిసారి. ఇవాళ ఆర్చరీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఇండియా తన ఖాతాలో ఓ గోల్డ్ మెడల్ వేసుకున్నది. దీంతో ఇండియా మెడల్ ట్యాలీ పెరిగిపోయింది.
గతంలో భారత్ ఆసియా క్రీడల్లో అత్యధికంగా 70 పతకాలను గెలుచుకున్నది. ఇప్పుడు ఆ రికార్డును అథ్లెట్ల బృందం బ్రేక్ చేసింది. జకర్తాలో 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో ఇండియా 70 మెడల్స్ గెలుచుకున్నది. ఆ ఏడాది 16 స్వర్ణాలు, 23 సిల్వర్, 31 కాంస్య పతకాలను ఆ బృందం తన ఖాతాలో వేసుకున్నది. ఈసారి ఇప్పటికే 16 గోల్డ్, 26 సిల్వర్, 29 కాంస్య పతకాలను ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 35 కిలోమీటర్ల మిక్స్‌డ్ రేస్ వాక్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం వచ్చింది. మంజూ రాణి, రామ్ బాబూ ఆ మెడల్‌ను గెలుచుకున్నారు.
Here's News
✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨
With this gold in archery, 🇮🇳's medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅
Our athletes' dedication and hard work have made this moment possible🔥
Let's keep the cheers… pic.twitter.com/mgrB9ackxV
— SAI Media (@Media_SAI) October 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 04, 2023 11:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

