APL 2022: జూలై 6 నుంచి 17 వరకు ఏపీఎల్ 2022, విశాఖ YSR స్టేడియంలో జూలై 17న ఫైనల్, సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఏసీఏ బృందం
జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) టీ–20 టోర్నమెంట్ లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం సీఎం నివాసంలో సీఎం వైఎస్ జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రెసిడెంట్ పి.శరత్‌చంద్రారెడ్డి, ట్రెజరర్ గోపినాథ్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాలరాజు, టెక్నికల్ ఇన్‌చార్జ్ విష్ణు దంతుతో పాటు.. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు.
ల్యాప్‌టాప్‌లో ఏపీఎల్ టీ–20 టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని సీఎం జగన్‌కు ఏసీఏ ప్రెసిడెంట్ పి.శరత్‌చంద్రారెడ్డి వివరించారు. టీ–20 టోర్నమెంట్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ– 20 టోర్నమెంట్ లోగో ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
లోగోతో పాటు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ – 20 టీజర్‌ను ఆవిష్కరించిన సీఎం. జులై 6 నుంచి జులై 17 వరకు విశాఖపట్నం డాక్టర్ వైయస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్, pic.twitter.com/Bwh8mLApyK
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 08, 2022 12:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

