Asia Cup 2022: షాకింగ్ వీడియో, పాకిస్తాన్ అభిమానులను తరిమి తరిమికొట్టిన ఆఫ్ఘన్లు, షార్జా స్టేడియంలో రచ్చ రచ్చ, కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం

ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ వికెట్‌ తేడాతో పరాజయం పాలై, టీమిండియాతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది.అయితే, జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆఫ్ఘన్‌ అభిమానులు మ్యాచ్‌ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు.

Asia Cup 2022: షాకింగ్ వీడియో, పాకిస్తాన్ అభిమానులను తరిమి తరిమికొట్టిన ఆఫ్ఘన్లు, షార్జా స్టేడియంలో రచ్చ రచ్చ, కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం
Pakistan, Afghanistan Fans Clash After PAK vs AFG Super 4 Match at Sharjah

ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ వికెట్‌ తేడాతో పరాజయం పాలై, టీమిండియాతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది.అయితే, జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆఫ్ఘన్‌ అభిమానులు మ్యాచ్‌ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. కుర్చీలు విరుగగొట్టి, పాక్‌ అభిమానులపై దాడులు చేసి క్రూరంగా ప్రవర్తించారు. అప్పటివరకు పాక్‌ అభిమానులతో కలిసి మ్యాచ్‌ చూసిన ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం సృష్టించారు. ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు పాక్‌ అభిమానులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియం నుంచి దౌడు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 08, 2022 07:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).