Dattajirao Gaekwad Dies: భారత క్రికెట్లో తీవ్ర విషాదం, టీమిండియా మాజీ కెప్టెన్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

టీమిండియా మాజీ కెప్టెన్‌, అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునే దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు

Dattajirao Gaekwad Dies: భారత క్రికెట్లో తీవ్ర విషాదం, టీమిండియా మాజీ కెప్టెన్ దత్తా గైక్వాడ్ కన్నుమూత
Dattajirao Gaekwad (Photo Credit: Twitter/@mpparimal)

టీమిండియా మాజీ కెప్టెన్‌, అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునే దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అతని పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు.భారత తరపున 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్‌.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు.

1959 ఇంగ్గండ్‌ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా దత్తాజీ వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓటమి పాలైంది. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కూడా 1947 నుంచి 1961 కాలంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 47.56 సగటుతో 3139 పరుగులు చేశారు. అందులో 14 సెంచరీలు ఉన్నాయి.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 13, 2024 02:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).