ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ విధ్వంసం సృష్టించాడు(IML 2025). 51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సచిన్. కేవలం 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 27 బంతుల్లోనే అర్థసెంచరీ చేయడం విశేషం.
మాస్టర్ బ్లాస్టర్ తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ ఓటమి పాలైంది(International Masters League). ఆస్ట్రేలియా నిర్దేశించిన 270 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా మాస్టర్స్ సాధించలేకపోయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా మాస్టర్స్ 174 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఓడినా ఇండియా మాస్టర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది.
ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ 52 బంతుల్లో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 12 ఫోర్లు, 7 సిక్సర్లు వాట్సన్ రాణించగా బెన్ డంక్ కూడా సెంచరీ సాధించాడు. బెన్ డంక్ 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు.
Sachin blistering fifty in 27 Balls
𝐓𝐡𝐞 𝐌𝐚𝐞𝐬𝐭𝐫𝐨 𝐃𝐞𝐥𝐢𝐯𝐞𝐫𝐬! 🎶🏏
Sachin Tendulkar gave us a vintage 𝑴𝒂𝒔𝒕𝒆𝒓𝒄𝒍𝒂𝒔𝒔! 🌟#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/XFGVr63sWC
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 5, 2025
Sachin Tendulkar's blistering fifty in 27 Balls
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ విధ్వంసం..
51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపిస్తున్న లిటిల్ మాస్టర్ బ్యాటింగ్
ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ
కేవలం 33 బంతుల్లో 64 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్
Video Credits: International Masters League pic.twitter.com/vJlz17xEZ0
— BIG TV Breaking News (@bigtvtelugu) March 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)