వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్‌ ప్రదర్శన చేసిన వారిని ప్రోత్సహించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా మెడల్స్‌ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి గతంలో మాదిరిగా ఎలాంటి హడావుడి లేకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ఆ పేరును ప్రకటించారు. ఓటమితో నిరాశపడిన భారత డ్రెస్సింగ్‌ రూమ్‌ను ఉత్సాహపరిచేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించారు. చివరి మ్యాచ్‌లో ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డును విరాట్ కోహ్లీ అందుకున్నాడు. రవీంద్ర జడేజా చేతుల మీదుగా కోహ్లీ స్వీకరించాడు.

ఈ సందర్భంగా ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ మాట్లాడాడు.  ‘‘భారత ఆటగాళ్లు చివరి వరకూ అద్భుతంగా పోరాడారు. అయినా ఫలితం మనకు ఆనుకూలంగా రాలేదు. రాహుల్‌ ద్రవిడ్ చెప్పినట్లుగా మన ఆటతీరు గర్వపడేలా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఆటగాడికి అభినందనలు చెబుతున్నా. చివరి మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ప్రతి మ్యాచ్‌లోనూ మైదానంలో చురుగ్గా ఉంటాడు. అతడి వల్ల సహచరుల్లోనూ ఉత్సాహం వస్తుంది. ఇలా బెస్ట్‌ ఫీల్డర్ అవార్డును ఇవ్వడం వల్ల డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి వాతావరణం తీసుకురాగలిగాం’’ అని తెలిపాడు.

Virat Kohli Bags ‘Fielder of the Match’ Award Following T Dilip’s Inspiring Speech

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)