Ashwin 100 Wickets Video: ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డు, వీడియో ఇదిగో..

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు.టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ చరిత్ర సృష్టించాడు

Ashwin 100 Wickets Video: ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డు, వీడియో ఇదిగో..
Ravichandran Ashwin becomes first Indian to achieve rare feat to complete 1000 runs and 100 wickets

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు.టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా జానీ బెయిర్‌స్టోను అవుట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు.

అశ్విన్‌ కంటే ముందు జార్జ్‌ జిఫెన్‌(ఇంగ్లండ్‌ మీద), మోనీ నోబుల్‌(ఇంగ్లండ్‌ మీద), విల్ఫ్రెడ్‌ రోడ్స్‌(ఆస్ట్రేలియా మీద), గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌(ఇంగ్లండ్‌ మీద), ఇయాన్‌ బోతం(ఆస్ట్రేలియా మీద), స్టువర్ట్‌ బ్రాడ్‌(ఆస్ట్రేలియా మీద) టెస్టుల్లో ఈ ఫీట్‌ నమోదు చేశారు.  వీడియో ఇదిగో, జానీ బెయిర్‌ స్టో‌ని వెనక్కి పంపిన అశ్విన్, ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 23, 2024 06:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).