IPL 2023: వైరల్ వీడియో, భువనేశ్వర్‌ పాదాలను తాకిన డేవిడ్ వార్నర్, పైకి లేపి ఆలింగనం చేసుకున్న స్టార్ బౌలర్

ఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కాలికి దండం పెట్టాడు.

IPL 2023: వైరల్ వీడియో, భువనేశ్వర్‌ పాదాలను తాకిన డేవిడ్ వార్నర్, పైకి లేపి ఆలింగనం చేసుకున్న స్టార్ బౌలర్
Bhuvneshwar Kumar (Photo Credits: Getty Images)

ఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కాలికి దండం పెట్టాడు. టాస్‌ సందర్భంగా మైదానంలోకి వచ్చిన వార్నర్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడే వార్మాప్‌ చేస్తున్న భువీ పాదాలను తాకాడు. వెంటనే భువీ వార్నర్‌ను పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వార్నర్‌, భువనేశ్వర్‌ కలిసి కొన్ని సీజన్‌లపాటు సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 25, 2023 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).