Reece Topley Catch Video: ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ చూడని క్యాచ్, రోహిత్ శర్మను అద్భుతమైన క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన రీస్ టాప్లీ, వీడియో ఇదిగో..
ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆటగాడు రీస్ టాప్లీ స్టన్నింగ్ క్యాచ్‌తో స్టేడియంలోని ప్రేక్షకులందరినీ షాక్ అయ్యేలా చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మను టాప్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.
ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆటగాడు రీస్ టాప్లీ స్టన్నింగ్ క్యాచ్‌తో స్టేడియంలోని ప్రేక్షకులందరినీ షాక్ అయ్యేలా చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మను టాప్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.ఎంఐ ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో రెండో బంతిని హిట్‌మ్యాన్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్ షాట్ కొట్టాడు. హైటెన్షన్ మ్యాచులో పంజాబ్ ను చిత్తు చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్..పంజాబ్ పై 2 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం
దాంతో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టాప్లీ అమాంతం ఎడమవైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేతితో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. టాప్లీ పట్టిన ఆ స్టన్నింగ్ క్యాచ్‌తో అప్పటివరకు ముంబై అభిమానుల కేరింతలతో దద్దరిల్లిన వాంఖడే స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని అద్భుతమైన క్యాచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Here's Video
WHAT A CATCH!
Reece Topley takes a blinder to dismiss Rohit Sharma.
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB pic.twitter.com/wBAiSbBCoW
— IndianPremierLeague (@IPL) April 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 12, 2024 05:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

