MS Dhoni 77 Feet Cutout Video: వీడియో ఇదిగో, నందిగామలో 77 అడుగుల ధోనీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు, రేపు ధోనీ 44వ జన్మదినం
మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద రేపు ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.
మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద రేపు ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఆ రహదారిపై నుండి వెళ్తున్న వారిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులం కలిసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. తెలంగాణలో ఇప్పటికే 52 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశామని, ఇక్కడ 77 అడుగులది పెట్టామన్నాడు. తాము ధోనీపై అభిమానంతో ఇదంతా చేస్తున్నామన్నాడు.

Here's Video
Biggest Cutout for a Cricketer 😎🔥
77 feet @MSDhoni 🥵#MSDhoni @ChennaiIPL #WhistlePodu pic.twitter.com/9zdROqCwMo
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) July 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 06, 2023 08:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

