Saurabh Tiwary Retires: ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్, టీమిండియా తరపున, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సౌరభ్ తివారి రికార్డు ఇదిగో..
జార్ఖండ్ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ సౌరభ్ తివారి ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుత రంజీ సీజన్లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో వెల్లడించాడు.
- Read in
- తెలుగు
జార్ఖండ్ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ సౌరభ్ తివారి ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుత రంజీ సీజన్లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో వెల్లడించాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా తరఫున, ఐపీఎల్లో పలు మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన తివారి.. ఐపీఎల్లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌లు ఆడాడు.
2010 ఐపీఎల్ సీజన్లో తివారి ముంబై ఇండియన్స్ తరఫున 419 పరుగులు చేశాడు.భారత్ తరఫున అతను ఆడిన 3 మ్యాచ్‌ల్లో 49 పరుగులు చేశాడు.జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. కోహ్లి నేతృత్వంలోని అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన భారత యువ జట్టులో తివారి సభ్యుడు కావడం మరో విశేషం.ఆర్సీబీ 2011 సీజన్ కోసం భారీ మొత్తం వెచ్చించి తివారీని కొనుగోలు చేసింది.
Here's News
Saurabh Tiwary announced his retirement from professional cricket.
🔹 He has played in 9 out of the first 10 IPL seasons ✨
🔹 In IPL 2010, He won the Emerging Player of the Season award, playing for Mumbai Indians, scoring 419 runs which earned him a good bid in the next year… pic.twitter.com/N62PZPGGZu
— TCTV Cricket (@tctv1offl) February 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 12, 2024 08:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

