Virat Kohli Dance Video: విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో ఇదిగో, రామ్ లఖన్ సినిమాలోని మైనేమ్ ఈజ్ లఖన్ పాటకు చిందేసిన టీమిండియా స్టార్
విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’పాటకు మైదానంలో కాలు కదిపిన కోహ్లీ.. నిన్న శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రామ్ లఖన్ సినిమా పాటకు స్టెప్పులేసి అలరించాడు.
విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’పాటకు మైదానంలో కాలు కదిపిన కోహ్లీ.. నిన్న శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రామ్ లఖన్ సినిమా పాటకు స్టెప్పులేసి అలరించాడు.బౌండరీ లైన్ వద్ద కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘రామ్ లఖన్’ సినిమాలోని ‘మైనేమ్ ఈజ్ లఖన్’ అని గ్యాలరీలోని ఫ్యాన్స్ పాడడం మొదలుపెట్టారు.
ఆ పాట కాస్తా విరాట్ చెవిన పడడంతో కాలు కదపకుండా ఉండలేకపోయాడు. ఆ పాటకు పర్‌ఫెక్ట్‌గా రెండు స్టెప్పులు వేసి అలరించాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ 88 పరుగుల వద్ద అవుటై సెంచరీతోపాటు సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

Heres' Video
Virat Kohli dancing on 'MY NAME IS LAKHAN' 🤩 #INDvSL pic.twitter.com/28Uzadj50D
— Sameer Allana (@HitmanCricket) November 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 03, 2023 01:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

