ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే.భారత్ చేతిలో 228 పరుగుల తేడాతో పాక్ చిత్తైంది.పాక్ బ్యాటర్లను కట్టడి చేయడంలోస్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు.బలమైన పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేయడం వెనుక కుల్‌దీప్ (8 ఓవర్లలో 5/25) ప్రదర్శనే కారణం. మ్యాచ్ అనంతరం కుల్‌దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆట నుంచి దూరమైనప్పటికీ ఇలాంటి స్పెల్ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించాడు.
చాలా సంతోషంగా ఉందని చెప్పడం మినహా ఏమీ మాట్లాడలేను. కానీ, అత్యుత్తమ జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుంది. క్రికెట్‌ను ఆడటం ఆపేసి వీడ్కలు పలికినా సరే ఈ స్పెల్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైందేనని తెలిపాడు. 2017లో వన్డేల్లోకి అడుగు పెట్టిన కుల్‌దీప్ 87 వన్డేల్లో 146 వికెట్లు తీశాడు. వచ్చే ప్రపంచకప్ జట్టులోనూ స్థానం సంపాదించాడు.
Here's Videos
Pakistani can't play against kuldeep yadav 😹😹#INDvsPAK #AsiaCup2023 #ViratKohli #INDvPAKpic.twitter.com/bORUu8hmlo
— X (@MSDADDIC) September 12, 2023
I was waiting for this, but Hardik Pandya thrashed Ling Babar Azam.
This dismissal by Kuldeep Yadav has different fanbase ❤️#INDvPAKpic.twitter.com/QSKzjS4Pw5
— Ishu (@PocketDynamoo) September 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)