Snake In Cricket Match: మ్యాచ్ సాగుతుండగా ఆరడుగుల పాము.. శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ పోటీల్లో కలకలం.. వీడియో వైరల్
క్రికెట్ స్టేడియాల్లోకి పాములు రావడం ఇటీవల తరచుగా జరుగుతోంది. తాజాగా శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రవేశించింది.
Newdelhi, Aug 1: క్రికెట్ స్టేడియాల్లోకి పాములు (Snakes) రావడం ఇటీవల తరచుగా జరుగుతోంది. తాజాగా శ్రీలంకలో (Srilanka) లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్ లు (Match) నిర్వహిస్తున్నారు. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రవేశించింది. గాలె స్పిన్నర్ షకీబల్ హసన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మైదానంలో ఒక్కసారిగా పాము కలకలం చెలరేగింది. దాంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. బౌండరీ వద్ద పామును చూసిన వారు మైదానం సిబ్బందిని అప్రమత్తం చేయడంతో, వారు వెంటనే స్పందించి ఆ పెద్ద పామును మైదానం బయటికి పంపించివేశారు. అనంతరం, మ్యాచ్ కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
IMD Update: ఈనెల, వచ్చే నెలలో సాధారణ వర్షపాతమే.. భారత వాతావరణశాఖ ప్రకటన
LPL match was interrupted after snake invaded the field.pic.twitter.com/SUF7iVf2St#LPL | #LPL2023
— Saikat Ghosh (@Ghosh_Analysis) July 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 01, 2023 10:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

