IND vs PAK Asia Cup 2023: వీడియో ఇదిగో, జడ్డూ భాయ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి నొప్పితో విలవిలలాడిన పాక్ క్రికెటర్

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో పాక్ ఆల్‌రౌండర్‌ ఆఘా సల్మాన్‌ గాయపడ్డాడు.57 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

IND vs PAK Asia Cup 2023: వీడియో ఇదిగో, జడ్డూ భాయ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి నొప్పితో విలవిలలాడిన పాక్ క్రికెటర్
Salman Agha Ali cops a blow on face, starts bleeding in IND vs PAK Asia Cup 2023 Super Four match

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో పాక్ ఆల్‌రౌండర్‌ ఆఘా సల్మాన్‌ గాయపడ్డాడు.57 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆఘా సల్మాన్‌ పాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

అయితే స్పిన్నర్లు ఎటాక్‌ చేస్తుండడంతో హెల్మట్‌ తీసి ఆడాలని సల్మాన్‌ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పాక్‌ ఇన్నింగ్స్‌ 21 ఓవర్‌ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సల్మాన్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని అతడి ముఖానికి బలంగా తాకింది. కంటి కింద గాయం కాగా.. రక్తం కూడా వచ్చింది. దీంతో మైదానంలోనే సల్మాన్‌ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అతడు వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి కంకషన్‌ టెస్టు చేశాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా భారత్‌ చేతిలో 228 పరుగుల తేడాతో పాక్‌ చిత్తైంది.

Salman Agha Ali cops a blow on face, starts bleeding in IND vs PAK Asia Cup 2023 Super Four match

Heres' Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 12, 2023 01:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).