PSL 2023: వీడియో ఇదిగో.. షాహిన్ అఫ్రిది సంధించిన వేగానికి విరిగిన బ్యాట్, రెండో బంతికి స్టంప్ గాల్లోకి, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో ఖలందర్ తరపున ఆడుతున్న షాహీన్‌ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.

PSL 2023: వీడియో ఇదిగో.. షాహిన్ అఫ్రిది సంధించిన వేగానికి విరిగిన బ్యాట్, రెండో బంతికి స్టంప్ గాల్లోకి, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్
Shaheen Afridi (Photo Credits: Twitter/Pakistan Cricket)

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో ఖలందర్ తరపున ఆడుతున్న షాహీన్‌ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. తొలి బంతికి మహ్మద్‌ హరీస్‌ బ్యాట్‌ రెండు ముక్కలైంది. అనంతరం మరో బ్యాట్‌తో బ్యాటింగ్‌ కొనసాగించిన హరీస్‌ను షాహీన్‌ రెండో బంతికే క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. షాహీన్‌ సంధించిన వేగం ధాటికి ఆఫ్‌‌ స్టంప్‌ గాల్లోకి పల్టీలు కొడుతూ నాట్యం చేసింది. చూడముచ్చటైన ఈ తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాచ్ లో 0 పరుగుల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 27, 2023 03:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).