Daria Kasatkina: నేను స్వలింగ సంపర్కురాలిని, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రపంచ టెన్నిస్ స్టార్, నటాలియా జబైకోతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన రష్యన్ మహిళా టెన్నిస్ స్టార్ డారియా కసత్కినా
రష్యన్ మహిళా టెన్నిస్ స్టార్, ప్రపంచ నెంబర్ 12.. డారియా కసత్కినా (Daria Kasatkina) స్వలింగ సంపర్కంపై సంచలన వ్యాఖ్యలు చేసింది చేసింది. తాను లెస్బియన్ అని సగర్వంగా చెప్పుకుంటున్నానని తెలిపింది.
రష్యన్ మహిళా టెన్నిస్ స్టార్, ప్రపంచ నెంబర్ 12.. డారియా కసత్కినా (Daria Kasatkina) స్వలింగ సంపర్కంపై సంచలన వ్యాఖ్యలు చేసింది చేసింది. తాను లెస్బియన్ అని సగర్వంగా చెప్పుకుంటున్నానని తెలిపింది. కాగా ఎల్జీబీటీక్యూ(LGBTQ), హోమో సెక్సువల్‌పై రష్యా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు (Living In The Closet Pointless) చేసింది. ఇక 1993లోనే మాస్కో అధికారికంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ... 2013 నుంచి స్వలింగ సంపర్కం అనే పదం వినిపించడానికి వీల్లేదని.. ఎక్కడా కూడా ఆ పదం వాడకూడదంటూ నిషేధం విధించింది.
తాను లెస్బియన్ అన్న విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించిన కసత్కినా.. రష్యన్ స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియా జబైకో తో (Natalia Zabiiako) కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ ‘మై క్యూటీ పై’ అని షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా గతవారం రష్యన్ మహిళా ఫుట్‌బాలర్ నడ్య కరపోవా కూడా స్వలింగ సంపర్కంపై తనదైన శైలిలో స్పందించింది. కసత్కినా స్పందిస్తూ.. ‘కరపోవా ఈ విషయంలో మాట్లాడినందుకు చాలా సంతోషం. కానీ ఇంకా చాలా మంది మాట్లాడాలి. ముఖ్యంగా అమ్మాయిలు దీని మీద గళం వినిపించాలి. ఇలాంటి సందర్భాల్లో యువతకు మద్దతు కావాలి.మరీ ముఖ్యంగా క్రీడలలో ఉండే వ్యక్తులు చాలామందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ల ఈ సమస్య గురించి విరివిగా మాట్లాడాలి.’ అని పేర్కొంది.
@DKasatkina mama I’m a criminal pic.twitter.com/cCU05hr9tv
— Natalia Zabiiako (@NataliaZabiiako) July 19, 2022
My cutie pie @NataliaZabiiako pic.twitter.com/Jao9iRiOGq
— Daria Kasatkina (@DKasatkina) July 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 19, 2022 10:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

