చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్ మద్దతుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడు. చంద్రబాబును గాంధీ, ఆంబేద్కర్‌తో పోల్చడం దారుణమన్నారు. 6 వందల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లమీదకి రాలేదు. చంద్రబాబు గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నా శిష్యుడు అని అన్నారు.

చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి తొత్తులు. పవన్ కళ్యాణ్ అయితే డాన్స్ లు వేస్తున్నాడు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. జూనీయర్ ఎన్టీఆర్ తెలివైనవాడు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబును ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలుసు. బీజేపీ వలన దేశం సర్వనాశనం అయింది." అని కేఏ పాల్ మండిపడ్డారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నేను దీక్ష చేస్తే, ఏ నోటీసు లేకుండా నా మెడ, కాళ్ళు, చేయి విరగొట్టి అరెస్ట్ చేసారు. అదే చంద్రబాబు నాయుడిపై 12 సెక్షన్లు ఉన్న ఎందుకు అరెస్ట్ చెయ్యట్లేదు. పవన్ కళ్యాణ్.. ఒరేయ్ ప్యాకేజీ స్టార్ నీకు ఎంత డబ్బులు ఇచ్చారు. జనసైనికులు ఇప్పటికైనా అర్ధం చేసుకొని బయటకి వచ్చి మన బడుగు బలహీన వర్గాలని గెలిపించుకుందామని కేఏ పాల్ అన్నారు.

Chandra babu and Pawan and KA Paul (Photo-X)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)