Andhra Pradesh: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం, తండ్రీ కొడుకులతో సహా ముగ్గురు సజీవ దహనం, అర్థరాత్రి పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో ఒక్కసారిగా ఎగసిన మంటలు

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగాచారి వీధిలో ఉన్న పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Andhra Pradesh: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం, తండ్రీ కొడుకులతో సహా ముగ్గురు సజీవ దహనం, అర్థరాత్రి పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Fire (Representational image) Photo Credits: Flickr)

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగాచారి వీధిలో ఉన్న పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతుల్ని భాస్కర్‌, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు. షార్ట్‌ స్కర్యూట్‌తో అర్ధరాత్రి 2గం​. సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతుల్లో తండ్రీకొడుకులతో పాటు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 21, 2022 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).