టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదు. ఒక్కచోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలు వెనుకబడతాయి. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆవేదన కనిపిస్తోంది. విశాఖకు పరిపాలన రాజధాని వస్తే మీకు వచ్చిన నష్టమేంటి?. ఉత్తరాంధ్రకు ఒక్కసంస్థనైనా చంద్రబాబు తీసుకువచ్చారా?. టీడీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారు. విశాఖలో సెంటిమెంట్‌ లేదని అంటారా.. అమరావతిలో సెంటిమెంట్‌ ఉంటే లోకేష్‌ ఎందుకు ఓడిపోయాడని నిలదీశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)