ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తుకు వస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ (YS Jagan) మూడేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) పేరిట ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం , అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచిపోవడం టీడీపీ అధినేతకు అలవాటేనని ఆరోపించారు.

జగన్‌ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత దక్కిందని పేర్కొన్నారు. అమరావతిలో తాత్కలికంగా అసెంబ్లీని, హైకోర్టును, సచివాలయాన్ని నిర్మించారని అదే జగన్‌ 11వేలకు పైగా గ్రామ సచివాలయలు కట్టారని వెల్లడించారు. మెడికల్ కాలేజీలు కట్టి విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించారని, పోర్టులు కట్టి ఉపాధి కల్పించారని తెలిపారు. చంద్రబాబు కంటే జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ళలో 20రెట్లు ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారని తెలిపారు.  చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమీ దేవుడు కాదు, కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)