IAS Imtiaz Joins YSRCP: వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్, కర్నూలు అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థులతో 8వ జాబితా విడుదల
కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యనేతలు, ఎమ్మెల్యే, జిల్లా నేతలతో ఆయన అభ్యర్థిత్వంపై జగన్ చర్చిస్తున్నారు. దాదాపు అభ్యర్థిగా ఇంతియాజ్ ఫిక్స్ అయినట్టు సమాచారం. దీంతో ఇంతియాజ్‌కు జగన్ నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది.
Here's Video
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి ఇంతియాజ్
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్, సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్
ఈ కార్యక్రమంలో… pic.twitter.com/5lXDJYrsMd
— YSR Congress Party (@YSRCParty) February 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 29, 2024 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

