చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు కేటాయించడంపై విజయనగరం టీడీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. చీపురుపల్లి టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు. పెద్ద నాన్న కళావెంకట్రావుకి సహకరించేది లేదని ప్రకటించారు.

చీపురుపల్లి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కరపత్రాలు, పోస్టర్లను కార్యకర్తలు దహనం చేశారు. బాబు, లోకేష్‌ అచ్చెన్నాయుడు మోసగాళ్లంటూ నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళా వెంకట్రావుకు సహకరించేది లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.  అనంతపురంలో టీడీపీ ఆఫీసును తగలబెట్టిన కార్యకర్తలు, ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంతో మండిపడుతున్న అనుచరులు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)