Andhra Pradesh: పొలం నుంచి వస్తుండగా రైతును తొక్కి చంపిన ఏనుగు, మన్యం జిల్లాలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..

మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు.

Andhra Pradesh: పొలం నుంచి వస్తుండగా రైతును తొక్కి చంపిన ఏనుగు, మన్యం జిల్లాలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..
Elephant tramples farmer to death in Manyam district

మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు. తన దారిలో వెళ్లిపోతుండగా.. ఏనుగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో ఏనుగుల దాడులు తరచూ జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇటీవలే ఈ ఏనుగుల గుంపును తరమడానికి కుంకీ ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 26, 2024 06:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).