Kilari Rosaiah Resigns YSRCP: గుంటూరు జిల్లాలో వైసీపీని వీడిన మరో నేత, పార్టీకి రాజీనామా చేసిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య
గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా అదే బాటలో నడిచారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు రోశయ్య నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా అదే బాటలో నడిచారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు రోశయ్య నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఇవాళ ఆయన గుంటూరులో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండడంలేదని, పార్టీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్ట ప్రకారమే పార్టీ నడుస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో తనను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, కొందరు తనను మానసికంగా కుంగదీశారని కిలారు రోశయ్య వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను వైసీపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డికి సైతం పార్టీలో అన్యాయం జరిగిందని అన్నారు. వీడియో ఇదిగో, ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Here's News
Ponnur ex-MLA Kilari Rosaiah resigns from @YSRCParty pic.twitter.com/jcfknXrmkn
— Ramesh Kandula (@iamkandula) July 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 24, 2024 06:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

