Andhra Pradesh: షాకింగ్ వీడియో, విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం, దగ్ధమైన టపాసుల దుకాణాలు, మంటల్లో ఇద్దరు సజీవదహనం, భారీగా ఎగిసిపడ్డ మంటలు

దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. క్రాకర్స్ స్టాల్స్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న రాత్రి తిరుపతిలో, ఇవాళ విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం, దగ్ధమైన టపాసుల దుకాణాలు, మంటల్లో ఇద్దరు సజీవదహనం, భారీగా ఎగిసిపడ్డ మంటలు
Representational image | Photo Credits: Flickr

దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. క్రాకర్స్ స్టాల్స్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న రాత్రి తిరుపతిలో, ఇవాళ విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్రాకర్స్ షాపుల్లో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. స్టాల్స్‌లోని క్రాకర్స్ అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంతో భయంతో వ్యాపారులు , ప్రజలు పరుగులు తీసారు. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళన నెలకొంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. మంటల్లో ఇద్దరు సజీవదహనం అయ్యారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 23, 2022 11:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).