మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అత‌డిపై జిఎస్టీ అధికారులు పిర్యాదు చేయ‌డంతో విచారణ జరిపిన పోలీసులు నేడు శరత్‌ను అరెస్ట్ చేశారు. ఓటమి భయంతో సీఎం జగన్ రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.

తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కంపెనీలో డైరెక్టర్‌గా, కనీసం షేర్ హోల్డర్ కూడా కాని తన కుమారుడు శరత్‌పై.. కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘన కేసులు పెట్టారన్నారు. కాగా టీడీపీ తరపున చిలకలూరి పేట అభ్యర్థిగా శరత్ తండ్రి పత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. నీ రాజకీయాలే తేడా అనుకున్నా నువు కూడా తేడానే, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన పేర్ని నాని, వీడియో ఇదిగో..

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)