Corona in AP: ఏపీలో తాజాగా 415 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,944 కరోనా పరీక్షలు నిర్వహించగా 415 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 53, గుంటూరు జిల్లాలో 50 కేసులు వెల్లడయ్యాయి.

Corona in AP: ఏపీలో తాజాగా 415 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు
Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,944 కరోనా పరీక్షలు నిర్వహించగా 415 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 53, గుంటూరు జిల్లాలో 50 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు గుర్తించారు. అదే సమయంలో 584 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,356కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,64,287 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,45,276 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,655 మంది చికిత్స పొందుతున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 26, 2021 08:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).