తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. అయితే.. వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్‌ అయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్‌ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.

ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.

వీడియో ఇదిగో, చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు, వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్‌ డిమాండ్

Fire at Tirumala Laddu Counters:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)