ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఆడుదాం ఆంధ్రా కబడ్డీ పోటీల సందర్భంగా మరోసారి జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కబడ్డీ బరిలో దిగిన మంత్రి రోజా... "కబడ్డీ, కబడ్డీ" అని కూత పెట్టేందుకు బదులుగా "ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024)... జగనన్న వన్స్ మోర్" అంటూ కూత పెట్టారు. అనంతరం, కూతకు వచ్చిన ప్రత్యర్థి రైడర్ ను క్యాచ్ పట్టి మురిసిపోయారు.

మధ్యలో ఓసారి వెనక్కి తిరిగి కాలెత్తి లెగ్ టచ్ కోసం ప్రయత్నం చేశారు. దాంతో ఆ కబడ్డీ మ్యాచ్ చూస్తున్న వారు అరుపులు, కేకలతో రోజాను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)