Nara Devansh in Yuvagalam Padayatra: వీడియో ఇదిగో, తండ్రితో కలిసి పాదయాత్రలో నడిచిన నారా దేవాన్ష్, ఈ నెల 18న ముగియనున్న నారా లోకేష్‌ పాదయాత్ర

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తనయుడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు. నాన్నతో కలిసి కాలు కదిపారు. తనయుడి చేయి పట్టుకొని లోకేశ్ కాసేపు పరుగు తీశారు. దేవాన్ష్ తండ్రితో కలిసి పరుగు పెట్టడం అక్కడున్న వారికి ముచ్చటగొలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాదయాత్రలో నారా బ్రాహ్మిణి కూడా పాల్గొన్నారు.

Nara Devansh in Yuvagalam Padayatra: వీడియో ఇదిగో, తండ్రితో కలిసి పాదయాత్రలో నడిచిన నారా దేవాన్ష్, ఈ నెల 18న ముగియనున్న నారా లోకేష్‌ పాదయాత్ర
Nara Devansh in Yuvagalam Padayatra

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తనయుడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు. నాన్నతో కలిసి కాలు కదిపారు. తనయుడి చేయి పట్టుకొని లోకేశ్ కాసేపు పరుగు తీశారు. దేవాన్ష్ తండ్రితో కలిసి పరుగు పెట్టడం అక్కడున్న వారికి ముచ్చటగొలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాదయాత్రలో నారా బ్రాహ్మిణి కూడా పాల్గొన్నారు. లోకేశ్ ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్రను ప్రారంభించారు.

అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రెండు నెలల పాటు యాత్రకు బ్రేక్ వచ్చింది. తండ్రి జైలు నుంచి బయటకు వచ్చాక లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. నవంబర్ 26న తూర్పు గోదావరి రాజోలు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ రోజు వరకు 220 రోజుల్లో 3,000 వేల కిలోమీటర్లు లోకేష్ పాద యాత్ర చేశారు. ఈ నెల 18న పాదయాత్ర ముగించి 20న మధ్యాహ్నం రెండు గంటలకు భోగాపురం మండలం పోలిపల్లిలో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు.

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 11, 2023 07:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).