తిరుపతి జిల్లా గూడూరులోని సాధుపేట సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై వెనుక నుండి ఓ యువకుడు కర్రతో దాడి చేయడం కలకలం రేపింది.దీనిపై పోలీసుల ప్రాధమిక విచారణలో యూనిఫాంను చూసి కానిస్టేబుల్‌పై కర్రతో దాడి చేశాడని తేలింది. నిందితుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన లల్తూ కలిండిగా గుర్తించారు. వీడియో ఇదిగో, ఏపీలో పోలీసును కూడా వదలడం లేదు, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద కర్రతో దాడి చేసిన యువకుడు
యూనిఫాంలో ఉన్న పోలీసులను చూడగానే.. అతను సైకోలా మారతాడని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.గూడూరు పట్టణంలో కానిస్టేబుల్ స్వామిదాస్‌పై దాడి చేసిన వీడియో వైరల్ అయిన సంగతి విదితమే. ఆయన గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు.దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన్ను వెంటనే గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత అతన్ని అధునాతన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Here's Video
యూనిఫాంను చూసి కానిస్టేబుల్‌పై కర్రతో దాడి చేసిన ఉన్మాది.
గూడూరు పట్టణంలో కానిస్టేబుల్ స్వామిదాస్‌పై దాడి చేసిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన లల్తూ కలిండి(24) అనే వ్యక్తి, పోలీస్ యూనిఫాంలో ఉన్న వారిని చూస్తే ఉన్మాదిలా మారిపోతాడని తెలియడంతో అవాక్కైన పోలీసులు. https://t.co/84XAeSsrVV pic.twitter.com/vl3mfusJEl
— ChotaNews (@ChotaNewsTelugu) July 19, 2024
.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)