Vijayawada Rains: వీడియో ఇదిగో, మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసులు

భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో విజయవాడ నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది.

Vijayawada Rains: వీడియో ఇదిగో, మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసులు
No fresh water.. No food... Vijayawada YSR Colony residents are concerned Watch Video

భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో విజయవాడ నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది.కృష్ణా నదిలో భారీగా వస్తున్న వరద నీరు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం సంపులో చేరడం.. వాగుకు పైనుంచి వచ్చే వరద నీరు సంపు వరకు రాకపోవడంతో గంటగంటకు కొండవీటి నీటిమట్టం పెరుగుతోంది. నిన్న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి గుహల వద్ద కొండవీటి వాగు 8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండగా.. రాత్రికి 11 అడుగులకు చేరింది.మంచినీళ్లు లేవు.. ఆహారం లేదు... చాలామంది రోగులున్నారు.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసుల ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి వీడియో ద్వారా తెలియజేశారు.  ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 02, 2024 01:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).