Corona in AP: ఏపీలో కొత్తగా 41 మందికి కరోనా, గడచిన 24 గంటల్లో ఏపీలో 75 మంది డిశ్చార్జ్

ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిపోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 75 మంది కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 395కి పడిపోయింది. కొత్త కేసుల విషయానికొస్తే... తాజాగా 10,502 కరోనా పరీక్షలు చేపట్టగా, 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Corona in AP: ఏపీలో కొత్తగా 41 మందికి కరోనా, గడచిన 24 గంటల్లో ఏపీలో 75 మంది డిశ్చార్జ్
Coronavirus outbreak | (Photo Credits: IANS)

ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిపోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 75 మంది కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 395కి పడిపోయింది. కొత్త కేసుల విషయానికొస్తే... తాజాగా 10,502 కరోనా పరీక్షలు చేపట్టగా, 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 15, తూర్పు గోదావరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,19,448 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,323 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 14,730 మంది మరణించారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 26, 2022 08:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).