Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఇన్నోవా కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు
పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగి సోమసి బాలగంగాధర్ శర్మ(78), ఆయన సతీమణి యశోద(67), డ్రైవర్ మృతి చెందారు. దారుణం, జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్‌ను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టిన యజమాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
బాలగంగాధర్ శర్మ కుమారుడు హెచ్‌ఎస్‌వై శర్మ, ఆయన భార్య నాగసంధ్య, వీరి పిల్లలు కార్తిక్, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శర్మ, అనుపమ పరిస్థితి విషమంగా ఉందని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Here's Videos
వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం గ్రామ సమీపంలో బళ్లారి నుండి గుంటూరు వైపు వెళ్తూ నిద్రమత్తులో ఇన్నోవా కారు రాంగ్ రూట్ లో రైట్ సైడ్ ఉన్న చెట్టును ఢీ కొంట్టడం తో అక్కడి అక్కడే ముగ్గురు మృతి చెందారు #caraccident #Palnadu #AndhraPradesh #chotanews pic.twitter.com/1oCtntcHAs
— ChotaNews (@ChotaNewsTelugu) June 27, 2024
ఏపీ: పల్నాడు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు.
Follow @bigtvtelugu for more updates#AndhraPradesh #APnews #Palnadu #RoadAccident #TeluguNews #Newsupdates #bigtvlive pic.twitter.com/adGta6vFqH
— BIG TV Breaking News (@bigtvtelugu) June 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 27, 2024 06:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

