AP Assembly Session 2022: వైరల్ వీడియో, ఎడ్ల బండి కాడిని మోసిన నారా లోకేష్, వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసన
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఈ వినూత్న నిరసనకు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేతృత్వం వహించారు. అంతేకాకుండా ఎడ్ల బండి కాడిని ఆయన తన భుజంపై పెట్టుకుని మోశారు. రైతు ద్రోహిగా నిలుస్తున్న సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ వినూత్న నిరసనకు దిగినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
రైతు ద్రోహి జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు నారా లోకేష్ గారు, మరియు సహచర టీడీపీ నాయకులతో కలిసి, ఎడ్ల బండి కాడి మోస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర లేదు, ధాన్యం డబ్బులు చెల్లించలేదు డ్రిప్పు పరికరాలు ఇవ్వలేదు. @ysjagan pic.twitter.com/wi9rH48Tmc
— B.Tech Ravi.MLC (@BTechRaviOff) September 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 19, 2022 07:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

