Andhra Pradesh: విజయవాడ వ్యాపారులు దారుణం, బకాయిలు అడిగినందుకు ధర్మవరం వ్యాపారుల బట్టలు ఊడదీసి నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం

ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడ చీరల వ్యాపారులు దాష్టీకం ప్రదర్శించారు. చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను బెజవాడ వ్యాపారులు నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారు. డబ్బు బకాయి విషయంపై వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది.

Andhra Pradesh: విజయవాడ వ్యాపారులు దారుణం, బకాయిలు అడిగినందుకు ధర్మవరం వ్యాపారుల బట్టలు ఊడదీసి నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం
Traders of Bejawada showed bravery against Dharmavaram saree traders (Photo-Video Grab)

ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడ చీరల వ్యాపారులు దాష్టీకం ప్రదర్శించారు. చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను బెజవాడ వ్యాపారులు నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారు. డబ్బు బకాయి విషయంపై వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది.

కోపంతో ఊగిపోయిన బెజవాడ వస్త్ర దుకాణ వ్యాపారి విచక్షణ మరచి ఇద్దరు వ్యాపారుల బట్టలు ఊడదీసి దాడి చేశాడు. అంతటితో ఆగకుండా నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యాపారులను వీడియోలు తీశాడు. ఆపై వీడియోలను ధర్మవరంలో వ్యాపారులకు పంపించి వికృతంగా ప్రవర్తించాడు. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 06, 2023 08:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).