Andhra Pradesh: విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం, ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు, మరో ముగ్గురు ప్రాణాలతో బయటకు

విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

Andhra Pradesh: విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం, ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు, మరో ముగ్గురు ప్రాణాలతో బయటకు
Representtaional Image (Photo Credits: Pixabay)

విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.తగరపువలసలో ఇంజనీరింగ్‌ చదువుతున్న ఈసీఈ బ్రాంచ్‌కు చెందిన సాయి, సూర్య గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్‌ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 18, 2022 06:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).