AP Assembly Session 2023: బాలకృష్ణకు మెంటల్ ఉంది కాల్పులు జరుపుతాడేమో, అసెంబ్లీలోకి రానివ్వకండి అధ్యక్షా, వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్స్ వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ వేయడం బాలయ్యకే చెల్లిందన్నారు.

AP Assembly Session 2023: బాలకృష్ణకు మెంటల్ ఉంది కాల్పులు జరుపుతాడేమో, అసెంబ్లీలోకి రానివ్వకండి అధ్యక్షా, వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Biyyapu MadhuSudhan Reddy (Photo-Video Grab)

అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్స్ వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ వేయడం బాలయ్యకే చెల్లిందన్నారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ ప్రవర్తనపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని...ఆయనను ఆస్పత్రికి తరలిస్తే మంచిదని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమా డైలాగులను మధుసూదన్ రెడ్డి సభలో వినిపించారు. ఫ్లూటు జింక ముందు ఊదు..జింక లాంటి మీ బావ చంద్రబాబు ముందు ఫ్లూట్‌ ఊదుకోవాలి..సింహం లాంటి సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి ముందు ఊదకండి అంటూ మధుసూదన్ రెడ్డి సూచించారు. చంద్రబాబు సైకో..ఆయన తమ్ముడికి మెంటల్‌ ఉందని, బాలకృష్ణకు మెంటల్‌ సర్టిఫికెట్‌ ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి బాలకృష్ణ సభలో కాల్పులు జరిపే అవకాశం ఉందని.. ఆయనను బయటకు పంపించాలని సూచించారు. అంతేకాదు టీడీపీ సభ్యులను మానసిక ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. వీడియో ఇదిగో..

Biyyapu MadhuSudhan Reddy (Photo-Video Grab)

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 22, 2023 12:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).